Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ హీరోగా నూతన దర్శకుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. తాన్య రవిచంద్రన్ కథానాయిక. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 21 హీరో కార్తికేయ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాల గురించి దర్శక, నిర్మాతలు శ్రీ సరిపల్లి, రామారెడ్డి మాట్లాడుతూ, 'ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా. ఇందులో కార్తికేయ పవర్ఫుల్ ఎన్ఐఏ ఆఫీీసర్గా కనిపిస్తారు. కథ వినగానే హీరో కార్తికేయ వెంటనే ఓకే చేశారు. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అని తెలిపారు. సాయి కుమార్, తనికెళ్ళ భరణి, సుధాకర్ కోమాకుల, పశపతి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్.ఆర్.విహారి, ఛాయాగ్రహణం: పి.సి.మౌళి, నిర్మాత: రామారెడ్డి, రచన - దర్శకత్వం: శ్రీ సరిపల్లి.