Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాస్యనటుడు షకలక శంకర్ లీడ్రోల్లో మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణలో రూపొందిన హర్రర్ ఎంటర్టైనర్ 'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది'. టైటిల్‌తోనే అటు మాస్ ఆడియెన్స్‌లో, ఇటు క్లాస్ అడియెన్స్లో అనూహ్య స్పందన తెచ్చుకున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. 'మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఫుల్ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటరైనర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం .కొత్త దర్శకుడు కుమార్ కోట ఈ కథను చాలా చక్కగా తెరకెక్కించాడు. ఆద్యంతం వినోదంతో ఉన్న డైలాగ్స్ కూడా బాగా కుదిరాయి. శంకర్ యాక్షన్, కామెడీ తదితర అంశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి' అని నిర్మాతలు లుకాలపు మధు, దత్తి సురేష్ బాబు, సోమేశ్ ముచర్ల తెలిపారు. 'షకలక శంకర్ నుంచి ఆడియన్స్ ఆశించే కామెడితో పాటు మరికొన్ని థ్రిల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. డైరెక్టర్‌గా ఇది నా తొలి సినిమా. ఈ సినిమాని ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ రొమాంటిక్ కమర్షియల్ స్టోరీతో తెరకెక్కించాం. ఆడియన్స్‌ని ఈ సినిమా తప్పకుండా అలరిస్తుంది' అని దర్శకుడు కుమారు కోట చెప్పారు.షకలక శంకర్, ప్రియజి, అర్జున్ కళ్యాణ్, రాజ్ స్వరూప్, మధు, స్వాతి, అవంతిక, హీనా, రితిక చక్రవర్తి, సంజన చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్ : ఫణింద్ర వర్మ అల్లూరి, మ్యూజిక్ : పిఆర్, స్టోరీ, డైలాగ్స్ : విఎస్ రావ్, డైరెక్టర్ : కుమార్ కోట.