Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాప్పీ ప్రథాన పాత్రలో నటించిన 'తప్పడ్' చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. 14వ ఆసియన్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో రెండు పురస్కారాలను దక్కించుకుంది. 11 దేశాల నుంచి 39 సినిమాలు ఈ అవార్డులకు నామినేట్ అయ్యాయి. విశ్వ వ్యాప్తంగా ప్రతిభ గల నటీనటులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ అవార్డుల వేడుకను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. అయితే కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈసారి అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆన్లైన్ ద్వారా జరుపబోతున్నారు. అక్టోబర్ 28న ఈ ప్రదానోత్సవం జరుగనుంది.
'నేను నటించిన సినిమాకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కటం చాలా ఆనందంగా ఉంది. ఇది మా సినిమాకి దక్కిన గౌరవమే కాదు. మహిళలకు లభించిన గౌరవం కూడా. కుటుంబం కోసం ఎన్ని కష్టాలు పడినప్పటికీ ఆత్మ గౌరవం విషయంలో రాజీపడని ఓ మహిళ ఇతివృత్తంతో రూపొందిన మా చిత్రానికి అవార్డులొస్తాయని ఊహించలేదు. అయితే దీనికి అవార్డులు ఇవ్వడం వల్ల ఈ సినిమా ద్వారా దర్శకుడు అనుభవ్ సిన్హా ఏమైతే చెప్పాలనుకున్నారో అది అంతర్జాతీయ ప్రేక్షకులకు కూడా రీచ్ అయ్యింది' అని తాప్సీ ఆనందం వ్యక్తం చేశారు.