Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలు మనతో లేకపోయినా.. ఆయన పాడిన పాటలు ఎప్పుడూ మనతో కలిసే ఉంటాయి. - కృష్ణ
ఎస్పి సర్.. ఎన్నో ఏళ్లు నా గొంతుక అయ్యారు. మీ గొంతు, మీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. ఎస్పీబీగారికి పాటకు, వాయిస్‌కి అభిమానులు కానీ వారు దేశంలోనే ఎవరూ ఉండరు. - రజనీకాంత్
బాలు నా సోదరుడే కాదు. నా ఆరో ప్రాణం. - కె.విశ్వనాథ్
సంగీత ప్రపంచానికి చీకటి రోజు. సంగీత జ్ఞాని బాలు మతితో ఓ శకం ముగిసింది. నాకు బాలుగారు ఎన్నో పాటలు పాడారు. నా విజయంలో ఆయన గాత్రానికి కూడా ప్రధాన పాత్ర ఇవ్వాలి. - చిరంజీవి
ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు. అన్ని దేవుళ్ల పాటలు పాడి ఆ దేవుళ్లనందరినీ మెప్పించిన గాన గంధర్వుడు. - మోహన్ బాబు
భారతదేశం గర్వించే గాన గంధర్వుడు బాలుగారి నిష్క్రమణ యావత్ సినీ, సంగీత ప్రపంచానికే తీరని లోటు.ఆయన పాడిన నాన్నగారి పాటలుగానీ, నా పాటలుగానీ వినని రోజంటూ ఉండదు. - బాలకృష్ణ
బాలుగారితో నా అనుభవాలు, సంభాషణలు కన్నీళ్ల రూపంలో వస్తున్నాయి. దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో. - నాగార్జున
ఒక లెజెండ్‌ను కోల్పోయాం. 'ప్రేమ', 'పవిత్రబంధం' వంటి చిత్రాల్లో ఆయనతో కలిసి నటించే గౌరవాన్ని దక్కించుకున్నాను. మీ లెగసీ ఎప్పటికీ నిలిచిపోతుంది. - వెంకటేష్
నా సినిమాలకు గళమివ్వడమే కాకుండా చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి బాలు. బాలు అన్నా, ఆయన పాటలన్నా ప్రత్యేక గౌరవం ఉంది. - పవన్‌కళ్యాణ్
బాలుగారు లాంటి వాయిస్ ఎవరికీ ఉండదు. ఆయన లెగసీ అమరం.
- మహేష్
తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే.
- ఎన్టీయార్
ఎస్పీ సర్.. మీరు ఇకలేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. నా గుండె ముక్కలైంది. - ఏ.ఆర్.రెహ్మాన్
ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే బాలుగారు లేని లోటుని ఊహించలేకపోతున్నా.
- రామ్‌చరణ్
నా కన్నీటిని ఆపుకోలేకపోతున్నా. మిమ్మల్ని మిస్ అవుతున్నాం. నా హృదయం బాధతో నిండిపోయింది. - తమన్
హదయం బద్దలైంది. మీరు ఎప్పటికీ మా హదయాల్లో నిలిచి ఉంటారు.
- అనుష్క
కెరీర్ ప్రారంభం నుంచే బాలుతో ప్రయాణించా. నా పాటలకు ఊపిరి పోశారు. ఆయన ఊపిరితోనే ఇంత ఎదిగాను. - సంగీత దర్శకుడు కోటి
ఓ శకం ముగిసింది. సంగీతం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రపంచం ఒకేలా ఉండదు. నేను ఉత్తమ గాయనిగా మారటానికి కారణం మీరే. - చిత్ర
మనం కోల్పోయింది బాలుగారినే.. ఆయన స్వరాన్ని కాదు. ఆయన గాత్రం ఎల్లప్పుడూ ఈ గాలిలోనే ఉంటుంది. - దర్శకుడు శంకర్
సల్మాన్‌ఖాన్, అక్షరుకుమార్, బోనీకపూర్, రవితేజ, విజయశాంతి, రాజమౌళి, దేవిశ్రీప్రసాద్, సిిరివెన్నెల, భారతీరాజా, అశ్వనీదత్, ఎ.ఎం.రత్నం, నాని, కొరటాల శివ, రఘుకుంచెతోపాటు ఎంతో మంది ప్రముఖులు బాలుతో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. బాలు మృతిపట్ల తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, ఏపీ ఫిల్మ్ ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, సంగీత దర్శకుల సంఘం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.