Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విష్ణు హీరోగా నటిస్తున్న 'మోసగాళ్లు' టైటిల్ కీ థీమ్ మ్యూజిక్ ఇటీవల 'ద రైజ్ ఆఫ్ మోసగాళ్లు' పేరిట విడుదలైంది. ఆసక్తికరంగా ఉన్న ఈ థీమ్ మ్యూజిక్ బాగా పాపులరైంది. అంతేకాదు కుర్చీల్లో మునివేళ్లపై కూర్చోపెట్టి చూసే థ్రిల్లర్‌గా 'మోసగాళ్లు' సినిమా ఉంటుందనే అభిప్రాయాన్నీ కలిగించింది.
'దక్షిణ భారత సినీ రంగంలోని ప్రముఖ సంగీత దర్శకుల్లో ఒకరిగా పేరు పొందిన శ్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. థీమ్ మ్యూజిక్‌తో అందరి మనసుల్ని గెలుచుకున్నారు. అలాగే అందరి అంచనాలకు మ్యాచ్ అయ్యేలా ఈ సినిమాకి సంబంధించిన తదుపరి ప్రమోషనల్ కంటెంట్‌కు వర్క్ చేస్తున్నారు. అలాగే సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి కషి చేస్తున్నారు. హీరోగా నటిస్తూ విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ సినిమాకి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు సోదరిగా, ఆయన పాత్రతో సమాన ప్రాధాన్యం ఉన్న పాత్రను కాజల్ అగర్వాల్ పోషిస్తున్నారు. భారత్‌లో మొదలై, అమెరికాను వణికించి చరిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో, వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.