Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పవన్‌కల్యాణ్ ముచ్చటగా మూడోసారి నిర్మాత బండ్ల గణేశ్‌తో సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని బండ్లగణేశ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ, 'నా బాస్ ఓకే చెప్పారు. మరోసారి ఆయనతో కలిసి పనిచేయబోతున్నాను. నా నెక్ట్స్ ప్రాజెక్ట్ ఆయనతో చేస్తున్నాను. నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్‌కల్యాణ్‌కు ధన్యవాదాలు' అని పవన్‌కల్యాణ్‌తో ఉన్న ఫొటోని షేర్ చేశారు.
వీరిద్దరి కాంబోలో 'తీన్మార్', 'గబ్బర్ సింగ్' సినిమాలొచ్చాయి.
- మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా 'చిరుత' సినిమాతో తెరంగేట్రం చేసిన రామ్‌చరణ్ సినీ పరిశ్రమలో దిగ్విజయంగా 13 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 'అప్పుడే 13 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేక పోతున్నా. గొప్ప విజయాలు.. కొన్ని పరాజయాలు.. అన్నింటినీ ఎంజాయ్ చేశా. అన్ని వేళలా నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. మరింత కష్టపడి మిమ్మల్ని సంతోషపెడతాను' అని రామ్‌చరణ్ ట్వీట్ చేశారు. అలాగే సోమవారం 'చిరుత' చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా రామ్‌చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు సైతం పూరీ జగన్నాథ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు.