Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంకొండ శ్రీనివాస్, 'కందిరీగ' ఫేమ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'అల్లుడు అదుర్స్'. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కొద్ది రోజుల క్రితం పునఃప్రారంభమైంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తోన్న సోనుసూద్ సోమవారం చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, ప్రకాష్ రాజ్, సోనుసూద్, నభా నటేష్, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి, సత్య, కాదంబరి కిరణ్, చమ్మక్ చంద్ర, దువ్వాసి మోహన్ తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదొక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఈ భారీ తారాగణం చెప్పకనే చెబుతోంది. ''అల్లుడు అదుర్స్' టైటిల్‌కి, ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి అన్ని వైపుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలో టీజర్‌ను రిలీజ్ చేస్తాం. 2021 సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాత సుబ్రమణ్యం గొర్రెల తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: చోటా కె. నాయుడు, ఎడిటింగ్: తమ్మిరాజు, ఆర్ట్: అవినాష్ కొల్లా, యాక్షన్: రామ్-లక్ష్మణ్, సమర్పణ: రమేష్‌కుమార్ గంజి, నిర్మాత: సుబ్రహ్మణ్యం గొర్రెల, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.