Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వర్ణ వివక్ష ఇప్పటికీ ఉంది. దీన్ని బేస్ చేసుకునే మా 'కలర్‌ఫొటో' సినిమా ఉంటుంది. ఇందులో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అమ్మాయి పాత్రలో నటించాను. అవుట్‌ఫుట్ చాలా బాగా వచ్చింది' అని అంటోంది కథానాయిక చాందినీ చౌదరి. సుహాస్, చాందినీ చౌదరి జంటగా రూపొందిన చిత్రం 'కలర్‌ఫొటో'. అమృత ప్రొడక్షన్పైగా సందీప్ దర్శకత్వంలో సాయిరాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 23న 'ఆహా' ఓటీటీ సంస్థ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో నాయిక చాందినీ చౌదరి శుక్రవారం మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే, 'నేను ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నానో.. అలాంటి సినిమా ఇది. ఈ సినిమా అవుట్‌ఫుట్ చూశాక ఓ మంచి సినిమా చేశాననే ఆత్మ సంతృప్తి కలిగింది. ప్రేక్షకులకూ ఆ ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు సందీప్ ఈ కథ చెప్పినప్పుడు నా పాత్ర చాలా బాగా నచ్చింది. 1990-97 ప్రాంతంలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అమ్మాయి పాత్రలో నటించా. అప్పట్లో ఇండిపెండెంట్‌గా ఉండే అమ్మాయిని ఎలా చూసేవారో ఈ సినిమాలో బాగా చూడొచ్చు. కథాపరంగా ఇందులో సుహాస్ నటించడం 100% కరెక్ట్. అది ఎందుకో సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా ఓటీటీలో విడుదలవ్వడమే బెటర్ అని ఫీలవుతున్నాను. అయితే థియేటర్లలో రిలీజ్ అవ్వలేకపోతోందనే బాధ నాకే కాదు కొత్త దర్శకుడు సందీప్, నిర్మాతలకూ ఉంది. ప్రస్తుతం విశ్వక్సేన్తో 'గామి', సుధీర్‌వర్మ ప్రొడక్షన్లో ప్రవీణ్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే ఓ ప్రేమకథా సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. నేను ఏ సినిమా చేసినా నా ఎదుగుదల ఆ సినిమాలో కనిపించాలని ఆశిస్తున్నాను. దీనికి అనుగుణంగానే చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నాను' అని తెలిపింది.