Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, 'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మ కాంబినేషన్లో ఓ యాక్షన్ థ్రిల్లర్‌ను నిర్మించేందుకు నిర్మాత సత్యనారాయణ కోనేరు సిద్ధమవుతున్నారు. ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 'ఆర్టి67' (రవితేజ 67వ చిత్రం) ప్రి లుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో స్టైలిష్ డాన్స్ చేస్తున్నట్లున్న రవితేజ షాడో ఇమేజ్ను మనం చూడొచ్చు. హవీష్ ప్రొడక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం ముహూర్తం వేడుక నేడు (ఆదివారం) జరగనున్నది. అలాగే ఆదివారం ఉదయం 11:55 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి నాయికగా నటించే ఈ చిత్రంలో డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్గా ఎంపికయ్యారు. ఈ చిత్రానికి నిర్మాత: సత్యనారాయణ కోనేరు, దర్శకుడు: రమేష్ వర్మ.