Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా కెరీర్లో ఇటువంటి పాత్రను ఇంత వరకు పోషించలేదు. ఈ సినిమా కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో.. నేనూ అలాగే వెయిట్ చేస్తున్నా. దీపావళికి మీ ఇంట్లో వాళ్ళందరినీ భయపెట్టడం ఖాయం' అని అంటోంది కైరా అద్వానీ.
అక్షరుకుమార్, కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం 'లక్ష్మీబాంబ్'. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 9న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొంది, ప్రేక్షకు ల ఆశేష ఆదరణతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'కాంచన'. టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్‌లను షేక్ చేసిన సినిమా కూడా. ఈ చిత్రాన్ని రాఘవ లారెన్స్ దర్శకత్వంలో బాలీవుడ్లో 'లక్ష్మీబాంబ్' పేరుతో రీమేక్ చేశారు. ఈచిత్రానికి సంబంధించి ''బుర్జ్ ఖలీఫా...' అనే వీడియో సాంగ్ ఆదివారం విడుదలైంది. దుబారులో బుర్జ్ ఖలీఫాకు ఎంతో గొప్ప పేరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి కట్టడం పేరుతో సాంగ్‌ను రూపొందించారు. ఈ పాటలో కైరా, అక్షరుల అభినయం అలరిస్తోంది.