Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమత ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలుగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కలర్ ఫొటో'. సుహాస్, చాందీని చౌదరి జంటగా, సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైవా హర్ష మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఓటిటి ఫ్లాట్ ఫామ్ 'ఆహా' యాప్ ద్వారా ఈ సినిమా ఈనెల 23న విడుదల అవుతుంది. ఈ నేఫథ్యంలో ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. 'అన్ని ఫార్మాట్స్‌లో యాక్ట్ చేసే అవకాశం నాకు వస్తుండటం నిజంగా అదష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా ప్రేక్షకులకి కచ్చితంగా నచ్చుతుంది' అని సునీల్ చెప్పారు.
నిర్మాత సాయిరాజేష్ మాట్లాడుతూ, 'ఈ సినిమాను తెరకెక్కించడానికి మా చిత్ర యూనిట్ పడిన కష్టం తెరపై కనిపిస్తోంది. 'ఆహా'లో రిలీజ్ అవ్వడానికి సహకరించిన అల్లు అరవింద్, బన్నీ వాసుకి కతజ్ఞతలు' అని అన్నారు. దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ,'నన్ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్న సాయిరాజేష్‌కి రుణపడి ఉంటాను. ఆయన సొంత కథ నాకు ఇచ్చి, నన్ను నమ్మి ఈ సినిమా తీశారు' అని అన్నారు. ఈ వేడుకలో మారుతి, శివ నిర్వాణ, హను రాఘవపూడి, ఎస్కేఎన్ తదితరులు పాల్గొని ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.