Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిఖిల్ హీరోగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం '18 పేజీస్'. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి, వాటితో పాటే తాజాగా నిఖిల్‌కి జోడిగా అనుపమా పరమేశ్వరన్‌ని ఎంపిక చేశారు.
'నిఖిల్, అనుపమా జోడి ఆన్ స్క్రీన్ అద్భుతంగా కనిపిస్తుంది. వారి క్యారెక్టర్లు కూడా ఆడియెన్స్‌ని ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దుతున్నాం' అని దర్శకుడు సూర్య ప్రతాప్ తెలిపారు. ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం ఇస్తున్నారు. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై గతంలో 'భలే భలే మగాడివోరు', 'గీతగోవిందం', 'ప్రతిరోజూపండగే' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు ఈ సినిమాపై అంతటా భారీ అంచనాలు నెలకొన్నాయని చిత్ర బృందం తెలిపింది.