Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్ కథానాయకుడిగా గోపికష్ణ మూవీస్, యూవి క్రియేషన్స్ పతాకాలపై డైరెక్టర్ రాధాకష్ణ కుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. 'బాహుబలి1', 'బాహుబలి2' , 'సాహౌ' వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ తన 20వ చిత్రాన్ని 'జిల్' చిత్ర దర్శకుడు రాధాకష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. 'ఈ చిత్రాన్ని డాక్టర్ యూ.వి.కష్ణంరాజు సమర్పించగా, వంశీ, ప్రమెద్, ప్రసీధలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్నో సూపర్‌హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపికష్ణ మూవీస్, యూవి క్రియేషన్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం వెర్షన్స్ కి సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నారు. గతంలో పలు హిట్ చిత్రాలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి విశేష స్పందన లభించింది. దసరా పండగ సందర్భంతోపాటు ఈనెల 23న ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' పేరిట మోషన్ పోస్టర్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం యూరప్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.