Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం 'కళాపోషకులు'. చలపతి పువ్వల దర్శకత్వంలో ఏమ్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటుడు జెమిని సురేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. బుధవారం ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ చిత్ర టీజర్‌ను మీడియా తరపున సీనియర్ జర్నలిస్ట్ ప్రభు విడుదల చేసి, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ - 'మా నిర్మాత సుధాకర్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడం వల్లే అవుట్‌ఫుట్ ఇంత బాగా వచ్చింది. 'ఆ నలుగురు' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా అయినా చాలా బాగా నటించారు. లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది.' అని అన్నారు. 'మీడియా వారి చేతుల మీదుగా మా సినిమా టీజర్‌ను విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఈ కథకి హీరోగా విశ్వకార్తికేయ పర్ఫెక్ట్ ఛాయిస్. దర్శకుడు చలపతి పువ్వల ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కల్యాణ్ సమి కెమెరా వర్క్, ఎలెందర్ మహావీర్ మ్యూజిక్ సినిమాకు అదనవు ఆకర్షణలు కానున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా కచ్చితంగా అలరిస్తుంది' అని నిర్మాత సుధాకర్‌రెడ్డి చెప్పారు.