Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం 'వైల్డ్ డాగ్'. మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న 6వ చిత్రమిది. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ మనాలీలోని బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో మొదలైంది. సుదీర్ఘంగా కొనసాగే ఈ షెడ్యూల్లో నాగార్జునతో సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఏసీపీ విజరు వర్మగా నాగార్జున ఇప్పటివరకూ చేయని విభిన్న తరహా పాత్రను చేస్తున్నారు. క్రిమినల్స్‌ను నిర్దాక్య్షిణంగా డీల్ చేసే విధానం వల్ల సినిమాలో ఆయన్ని 'వైల్డ్ డాగ్' అని పిలుస్తుంటారు. నాగార్జునకి జోడీగా దియా మీర్జా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సయామీ ఖేర్ కనిపించనున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కుమార్ సంభాషణలు రాస్తుండగా, షానీల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.