Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్ అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇస్తూ 'రాధేశ్యామ్' చిత్ర నిర్మాణ సంస్థలు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ ఈ చిత్రంలో ప్రభాస్ పోషిస్తున్న విక్రమాదిత్య పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్' పేరుతో మోషన్ పోస్టర్ని విడుదల చేయబోతున్న చిత్ర బంతం కొంచెం ముందుగానే ప్రభాస్‌కి అడ్వాన్డ్స్ హ్యపీ బర్త్‌డే విషెస్ చెబుతూ ఈ లుక్‌ని విడుదల చేయడం విశేషం. 'ప్రతి సినిమాకి తన హ్యాండ్ సమ్ లుక్స్, స్టైలిష్ మేకోవర్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసే ప్రభాస్, ఇప్పుడు ఈ సినిమాలో కూడా అల్ట్రా స్టైలిష్‌గా కనిపించబోతున్నారనే విషయం ఈలుక్ చూస్తే అర్ధమైపోతుంది. ఇటలీలో ఉన్న గ్రీకు కట్టడాలు బ్యాక్‌డ్రాప్‌లో వింటేజ్ కారు మీద బ్లూ బ్లేజర్ వేసుకుని స్టైలిష్‌గా కుర్చున్న ప్రభాస్ లుక్ అభిమానుల్లో ఈ చిత్రం పై మరింతగా అంచనాలు పెంచేలా ఉంది. ఇక 'బాహుబలి1', 'బాహుబలి2', 'సాహౌ' వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్రభాస్ తన 20వ చిత్రాన్ని 'జిల్' చిత్ర దర్శకుడు రాధాకష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని డాక్టర్ యూ.వి.కష్ణంరాజు సమర్పించగా, వంశీ, ప్రమెద్, ప్రసీధలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్నో సూపర్‌హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపికష్ణ మూవీస్, యూవి క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ వెర్షన్స్‌కి సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.