Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాయని, దర్శకురాలు రుషిక హనుమాన్ చాలీసాను వినూత్న రీతిలో ర్యాప్ మోడల్లో ఆలపించారు. ఈ పాటను సాయికుమార్ గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'అందరూ ఎంతో భక్తిభావంతో పాడుకునే హనుమాన్ చాలీసాని గాయని, దర్శకురాలు రుషిక ర్యాప్ మోడల్లో అద్భుతంగా ఆలపించడమే కాకుండా, అంతే అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఈ డివోషనల్ సాంగ్‌లో రుషిక హావభావాలు హైలెట్ అనేలా ఉన్నాయి. అలాగే క్వాలిటీ పరంగా హై స్టాండడ్స్‌తో ఈ సాంగ్‌ని తెరకెక్కించడం విశేషం. ఈ పాటని ఆలపించి, డైరెక్ట్ చేసి, నటించడం ఓ ఎత్తయితే, హనుమాన్ చాలీసాని వినూత్న రీతిలో పాడే ఆలోచన చేసిన రుషిక అభినందనీయురాలు' అని చెప్పారు. గాయని, దర్శకురాలు రుషిక మాట్లాడుతూ, 'హనుమాన్ చాలీసాని ప్రస్తుత తరానికి అర్ధుయ్యే రీతిలో కొంచెం వినూత్నంగా ర్యాప్ మోడల్లో చిత్రీకరించాం. లిరిక్స్, సాహిత్యాన్ని మాత్రం మార్చలేదు. పాట చిత్రీకరణలో ఉపయోగించిన చిత్రాలు, ప్రదేశాల అనుమతులన్ని తీసుకున్నాం. పాటకి సంబంధించిన కొన్ని పనుల కోసం పద్మజ హాస్పిటల్, స్కిల్ టెక్నాలజీస్ వారి సహాయం తీసుకున్నాం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం హనుమాన్ చాలీసాని ప్రజలకు మరింత చేరువ చేయటం కోసం మాత్రమే ఈ పాటని చిత్రీకరించి, విడుదలచేయటం జరిగింది' అని తెలిపారు.