Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం). తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ 119వ జయంతి (గురువారం) సందర్భంగా ఈ చిత్రం నుంచి 'రామరాజు ఫర్ భీమ్' టీజర్‌ను రామ్‌చరణ్ విడుదల చేశారు. ఇందులో కొమురం భీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్ క్యారెక్టర్ పరిచయాన్ని అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్ వెర్షన్లో ఈ టీజర్ సాగుతుంది.
'వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి..నిలబడితే రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ, వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ, నా తమ్ముడు, గోండు బెబ్బులి కొమురం భీమ్' అంటూ రామ్‌చరణ్ చెబుతున్న డైలాగ్స్, ఎన్టీఆర్నటనకు వరల్డ్‌వైడ్‌గా ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్, హైటెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రమిది. డిి.వి.వి. ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. 'బాహుబలి'తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌తోపాటు, భీమ్ ఫర్ రామరాజు టీజర్లకు వరల్డ్ వైడ్‌గా ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో 'రామరాజు ఫర్ భీమ్' కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. గురువారం రోజున విడుదలైన ఈ టీజర్ చూస్తుంటే ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఎన్నో భిన్న పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడు ఆ పాత్రలను మించేలా డిఫరెంట్ లుక్‌తో ఇందులో కనపడుతున్నారు. రామ్‌చరణ్ పాత్రను నిప్పుతో, ఎన్టీఆర్ పాత్రను నీటితో పోల్చుతూ పవర్ఫుల్ గా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. రూ.450 కోట్ల రూపాయల భారీ బడ్టెట్‌తో, భారీ పాన్ ఇండియా తారాగణంతో రూపొందుతున్న ఈ ఫిక్షనల్ పీరియాడికల్ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 2021లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.