Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పలు పర్మిషన్లు రావాల్సి ఉన్నందున 'ఆకాశం నీ హద్దురా' చిత్రం విడుదలలో జాప్యం జరుగుతోందని కథానాయకుడు సూర్య తెలిపారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. 'ఆకాశం నీ హద్దురా' (సూరారై పొట్రు) చిత్రం విడుదలలో జాప్యం జరగడానికి కారణాలను, తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను హదయాన్ని స్పశించేలా సూర్య ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన లెటర్లో పేర్కొన్నారు. ఒక లెటర్ ద్వారా తన ఆలోచనలను పంచుకోవడం తన దినచర్య కాదని, కానీ ఇప్పుడు తన అభిమానుల ముందు ఓపెన్ హార్ట్‌తో, పారదర్శక మనసుతో నిలబడాల్సిన ఒక పరిస్థితి తలెత్తిందని సూర్య చెప్పారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టినప్పుడు ఇదివరకెన్నడూ చిత్రీకరణ జరపని లొకేషన్లలో చేయడం, భిన్న బాషలకు చెందిన, భిన్న సామర్థ్యాలున్న వ్యక్తులతో పనిచేయడం అనేవి మాత్రమే తమ ముందున్న సవాళ్లని భావించామని ఆయన తెలిపారు. అయితే వాటిని ఎగ్జిక్యూట్ చేయడం చాలా పెద్ద విషయం అని ఈజీగా చెప్పవచ్చన్నారు. ఈ చిత్రం వైమానిక రంగం నేపథ్యంలో నడిచే కథ అని అందరికీ తెలిసిందేననీ, దీంతో తాము అనేక పద్ధతులు పాటించాల్సి వచ్చిందని, పర్మిషన్లు తీసుకోవాల్సి వచ్చిందని సూర్య చెప్పారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారం. మేం నిజమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాలు, సెక్యూరిటీతో డీల్ చేయాల్సి వచ్చింది. కొన్ని ఎన్ఓసీలు (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు) అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిరీక్షణ అనివార్యమని మేం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న కరోనా మహమ్మారి కాలంలో మిగతా అన్ని విషయాల కంటే దేశం, దాని ప్రాధాన్యాల మీదే అధిక దష్టి పెట్టాల్సి వస్తోందన్నారాయన. ఈ జాప్యాన్ని నా శ్రేయోభిలాషులు ప్రేమ, నమ్మకంతో అర్థం చేసుకుంటారని వ్యక్తిగతంగా నేను ఆశిస్తున్నాను అని సూర్య తెలిపారు. అన్ని అనుమతులూ లభించి విడుదలకు సిద్ధమయ్యాక ఆ విషయాన్ని తెలియజేస్తామని, ఈలోపు ట్రైలర్, మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తామని ఆయన వెల్లడించారు. ఈ లెటర్‌తో పాటు మన స్నేహం, ప్రేమ, అనురాగాలకు అంకితమిస్తూ అందమైన 'ఫ్రెండ్షిప్ సాంగ్'ను అందిస్తున్నామని సూర్య చెప్పారు.
ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్. గోపీనాథ్ జీవితంలో ఎదుర్కొన్న ఘటనలు, కష్టాలను ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సూర్య, మోహన్‌బాబు, అపర్ణా బాలమురళి ప్రధాన పాత్రధారులు. సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని 2డి ఎంటర్టైన్మెంట్, శిఖ్య ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సూర్య, గునీత్ మోంగా నిర్మిస్తున్నారు.