Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోహన్‌బాబు హీరోగా నటిస్తున్న దేశభక్తి కథా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసంలో శుక్రవారం చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌తో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభమైంది. ముహూర్తపు షాట్‌కు విరానికా మంచు, ఐరా, అవ్రమ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, లక్ష్మీ మంచు, విద్యానిర్వాణ సంయుక్తంగా క్లాప్ ఇచ్చారు. విష్ణు మంచు గౌరవ దర్శకత్వం వహించారు. అరియానా, వివియానా సంయుక్తంగా స్క్రిప్టును డైరెక్షన్ టీమ్‌కి అందించారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ సైతం ఈరోజే నుంచే మొదలైంది. 'స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన 'సన్ ఆఫ్ ఇండియా' టైటిల్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్ఫుల్ రోల్లో డాక్టర్ మోహన్‌బాబు నటిస్తున్న ఈ తరహా కథగాని, ఈ జోనర్ సినిమాగాని ఇప్పటివరకూ టాలీవుడ్లో రాలేదు. మేస్ట్రో ఇళయరాజా స్వరాలు అందిస్తున్న ఈ చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. డాక్టర్ మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్న ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్ సంభాషణలు రాస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ పాటలు రాస్తుండగా, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా విరానికా మంచు వ్యవహరిస్తుండటం విశేషం. ఆర్ట్ డైరెక్టర్‌గా చిన్నా పనిచేస్తున్నారు.