Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు 'రాధేశ్యామ్' చిత్ర నిర్మాణ సంస్థలు గోపి కష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ స్పెషల్ ట్రీట్ ఇచ్చాయి. శుక్రవారం ప్రభాస్బర్త్ డే కానుకగా 'రాధే శ్యామ్' మోషన్ పోస్టర్ని విడుదల చేశారు దర్శక, నిర్మాతలు. 'ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్యగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' పేరుతో విడుదలైన మోషన్ పోస్టర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ప్రేమికులు దేవదాస్, పార్వతి, లైలా మజ్ను ఫోటోల మీదుగా ఓ ట్రైన్లో ఈ మోషన్ పోస్టర్ సాగుతుంది. చివరగా ప్రభాస్, పూజ హెగ్డే జోడి కనిపిస్తుంది. ఈ ప్రేమకథ కూడా అంత గొప్పగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. ప్రతి సినిమాకి తన హ్యాండ్సమ్ లుక్స్, స్టైలిష్ మేకోవర్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసే ప్రభాస్ ఇప్పుడు 'రాధేశ్యామ్'లో కూడా అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ మోషన్ పోస్టర్‌తోనే సినిమా స్థాయి ఏంటో అర్థం అయిపోతుంది. 'బాహుబలి1', 'బాహుబలి2' , 'సాహౌ' వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్రభాస్ 'రాధేశ్యామ్' చిత్రాన్ని 'జిల్' చిత్ర దర్శకుడు రాధాకష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని డాక్టర్ యూ.వి.కష్ణంరాజు సమర్పించగా, వంశీ, ప్రమెద్, ప్రసీధలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్నో సూపర్‌హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపికష్ణ మూవీస్, యూవి క్రియేషన్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ వెర్షన్స్‌కి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈచిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. ప్రభాస్, పూజా హెగ్డే, సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రారు కపూర్, జగపతిబాబు, జయరాం, సచిన్ ఖేడ్కర్, భీనా బెనర్జి, మురళి శర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్, సత్యాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పకులు :డాక్టర్ యు.వి.కష్ణంరాజు, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరావు, యాక్షన్, స్టంట్స్ : నిక్ పవల్, మ్యూజిక్ : జస్టిన్ ప్రభాకరన్, సౌండ్ డిజైన్ : రసూల్ పూకుట్టి,
కొరియోగ్రఫి : వైభవి మర్చంట్, వి ఎఫ్ ఎక్స్ సూపర్వైజర్ : కమల్ కన్నన్.