Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పివియమ్ జ్యోతి ఆర్ట్స్ పతాకంపై మహి రాథోడ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం '1992'. దసరా సందర్భంగా చిత్రంలోని 'చెలియా చెలియా..' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని సెన్సేషనల్ డెరెక్టర్ వి.వి.వినాయక్ లాంచ్ చేయగా, మరో లిరికల్ వీడియోను నిర్మాత రాజ్ కందుకూరి రిలీజ్ చేేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ,'1992' టైటల్తోపాటు సాంగ్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. కొత్త వారు చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి' అని అన్నారు. 'కొత్త కాన్సెప్ట్‌తో కొత్త వారందరూ కలిసి చేస్తున్న ఈ చిత్రం విజయవంతం కావాలి. నేను లాంచ్ చేసిన పాట వినసొంపుగా ఉంది' అని రాజ్ కందుకూరి చెప్పారు. దర్శకుడు శివ పాలమూరి మాట్లాడుతూ,'దర్శకుడుగా ఇది నా తొలి చిత్రం. నేటి సమాజంలో ప్రేమ, పెళ్లిళ్లు ఎలా తయారయ్యాయో చూపించే సినిమా' అని తెలిపారు. 'వినాయక్ చేతుల మీదుగా మా సినిమాలో సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆఖరి దశలో ఉన్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం' హీరో, నిర్మాత మహి రాథోడ్ చెప్పారు.