Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1970లో విడుదలై అఖండ విజయం సాధించిన 'మేరా నామ్ జోకర్' సినిమా గురించి తెలియని వారుండరు. అలాంటి లెజెండరి క్లాసిక్ టైటిల్‌ని మరోసారి దర్శకుడు సూర్యగోపాల్ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. 4 ఏఎమ్
మూవీ మేకర్స్ బ్యానర్లో సూర్యగోపాల్ని దర్శకుడుగా పరిచయం చేస్తూ నిర్మాతలు శివ.ఎన్, ఎస్.జి.కష్ణ, నవీన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ దశమి సందర్బంగా డైరక్టర్ మారుతి ఈ చిత్ర తొలి షాట్‌ని దేవుడి పటాలపై క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. అలాగే దర్శకుడు గొపాల్కి స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రం నవంబర్‌లో సెట్స్ మీదకి వెళ్ళనుంది. దర్శకుడు మారుతి మాట్లాడుతూ,' నా స్నేహితుడు సూర్య గోపాల్‌కి సినిమా అంటే చాలా ఇష్టం. 'మేరా నామ్ జోకర్' అనే టైటిలంటేనే సూపర్‌హిట్. అలాంటిది చాలా సంవత్సరాల తర్వాత ఈ టైటిల్‌తో మళ్లీ సినిమా రావటం చాలా ఆనందంగా ఉంది. మా గోపాల్‌కి మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు. దర్శకుడు సూర్య గొపాల్ మాట్లాడుతూ,' నేను, మా మిత్రులు కలిసి ప్రోడక్షన్ నెం:1గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మా దర్శకుడు మారుతి 'మేరా నామ్ జోకర్' టైటిల్ ఎనౌన్స్ చేయటం అదష్ణంగా భావిస్తున్నాం. ఈ చిత్రంలో పాన్ ఇండియా ఆర్టిస్ట్‌లు నటించనున్నారు' అని తెలిపారు. 'ఈ చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. 3 సంవత్సరాలు కష్టపడి చేశాం. 24 క్రాఫ్స్ట్పై కమాండ్ ఉన్న దర్శకుడు గొపాల్ ' అని రచయిత రాజు బొనాల అన్నారు.