Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్రహీరో పవన్ కళ్యాణ్‌తో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ దసరా సందర్భంగా ప్రకటించారు. 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తొలిసారి మా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి సాగర్.కె.చంద్రను దర్శకుడిగా ఎంపిక చేశాం. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. 'గబ్బర్ సింగ్'గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో అశేష ప్రేక్షకులను అలరించిన పవర్‌స్టార్ మరోమారు పోలీస్ పాత్రలో ఈ చిత్రం ద్వారా రక్తి కట్టించనున్నారు. ఈ చిత్రానికి థమన్.ఎస్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ప్రతిభావంతులైన ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రాహకునిగా, ఎడిటర్‌గా నవీన్ నూలి, కళా దర్శకునిగా ఏ.ఎస్.ప్రకాష్‌లు ఎంపిక అయ్యారు' అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియనున్నాయి.