Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి తారకరత్న హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సారథి'. జాకట రమేష్ దర్శకత్వంలో పంచభూత క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విజయ దశమి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ని విడుదల చేసిందీ చిత్రయూనిట్.
ఈ సందర్భంగా దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ, 'ఇటీవల ఎనౌన్స్ చేసిన పంచభూత క్రియేషన్స్ బేనర్ లోగోకి, మా బేనర్లో నిర్మిస్తున్న 'సారథి' టైటిల్‌కి మంచి అప్రిసియేషన్ వచ్చింది. విజయదశమి కానుకగా నందమూరి తారకరత్న ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశాం. దసరాకి ఎంతో కాంపిటేషన్ ఉన్నప్పటికి మా సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. స్నేహితులు, సన్నిహితులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. కరోనా సమయంలో కూడా నందమూరి తారక ఎంతో సాహసంతో షెడ్యూల్‌ను పూర్తి చేసి మాకెంతో సహకరించారు. ఆయనకి మా చిత్ర బందం ఎప్పటికీ ఋణ పడి ఉంటుంది. గతంలో మా సినిమాకి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్ చేశారు. ఈ సినిమాకి కూడా వాళ్ల దగ్గర నుండి మంచి సపోర్ట్ లభిస్తోంది. మంచి కంటెంట్ ఉంటే ఇండిస్టీ ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందని 'రథేరా' తర్వాత మా 'సారది'¸ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. త్వరలో ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్: మనోహర్ కొల్లి, మ్యూజిక్ డైరెక్టర్: సిద్ధార్థ్ వాటికన్స్, మేకప్: శ్యామ్, స్టంట్స్: కష్ణ మాస్టర్, డాన్స్ మాస్టర్: హరి జాను, సోము, డిటిఎస్: పద్మారావు, ఎడిటింగ్: సాయి కుమార్ ఆకుల, ప్రొడ్యూసర్స్: నరేష్ యాదవ్. పి., వై.ఎస్. కష్ణమూర్తి, పి. సిద్దేశ్వర రావు, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జాకట రమేష్.