Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా లేటెస్ట్గా ఓ హాలీవుడ్ రొమాంటిక్ సినిమాకి గ్రీన్‌సిగల్ ఇచ్చారు. సోఫియా క్రామర్స్ రాసిన నవల ఆధారంగా 2016లో విడుదలై వరల్డ్‌వైడ్‌గా విశేష ప్రేక్షకాదరణ పొందిన జర్మనీ చిత్రం 'ఎస్ఎంఎస్ ఫర్ డిచ్'. ఈ సినిమాని స్ఫూర్తిగా తీసుకుని 'టెక్ట్స్ ఫర్ యు' పేరుతో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో ప్రియాంకతోపాటు 'అవుట్‌లాండర్' నటుడు శ్యామ్ హేగన్, మ్యూజిక్ ఐకాన్ సెలిన్ దియాన్ నటిస్తున్నారు. దీనికి 'గ్రేస్ ఈజ్ గాన్' దర్శకుడు జిమ్ స్ట్రౌజ్ దర్శకత్వం వహించబోతున్నారు. 'హేమాహేమీలతో హాలీవుడ్ రొమాంటిక్ చిత్రంలో నటించడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది' అని ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ప్రియాంక దీంతోపాటు 'వైట్ టైగర్' చిత్రంలోనూ నటిస్తోంది.