Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా చిన్నతనం నుంచి శ్రీదేవి నటించిన 'నాగినా', 'నాగినా 2' సినిమాలను చూస్తూ పెరిగాను. 'నాగిని'గా శ్రీదేవి నటన ఓ లాండ్మార్క్ గా నిలిచిపోయింది. అటువంటి పవర్ ఫుల్ రోల్ తో వెండితెరపై కనిపించబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది' అని బాలీవుడ్ కథానాయిక శ్రద్ధాకపూర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. శ్రద్ధా నాగినిగా నటిస్తున్న దీన్ని ట్రయాలజీగా విశాల్ ఫురియా దర్శకత్వంలో నిఖిల్ ద్వివేది నిర్మిస్తున్నారు. భారీ విఎఫెక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్‌కి స్కోప్ ఉన్న ఈ ట్రయాలజీని త్వరలోనే ఆరంభించబోతున్నారు. 1976లో రేఖా, రీనారాయ్ 'నాగిని'గా నటించి ప్రేక్షకులను అలరించారు. 1986లో 'నాగినా', 'నిగాహెన్.. నాగినా పార్ట్ 2'ల్లో 'నాగిని'గా శ్రీదేవి తనదైన మార్క్ నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది. ప్రభాస్ కి జోడిగా 'సాహౌ' చిత్రంలో నటించిన శ్రద్ధా ఈ ఏడాది ప్రారంభంలో 'స్ట్రీట్ డాన్సర్ 3డి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.