Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య హీరోగా 'అలా ఎలా?' ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 4గా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఉష ముల్పూరి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ నివ్వగా, హీరో నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేశారు. మరో దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్క్రిప్ట్‌ను దర్శకుడు అనీష్ కష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీమంత్రి పి.మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దర్శకుడు అనీష్ కష్ణ మాట్లాడుతూ,'నా మొదటి సినిమా 'అలా ఎలా?'తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను. ఈ సినిమాతో మరోసారి మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి మంచి టీమ్‌తో మరోసారి సిద్దమయ్యాను. టోటల్ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్. నా ఫస్ట్ సినిమాకి సినిమాటోగ్రఫి అందించిన సాయిశ్రీరామ్, నాగశౌర్యకి 'ఛలో'తో మంచి మ్యూజికల్ హిట్ ఇచ్చిన మహతి స్వరసాగర్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. తప్పకుండా ఒక మంచి సినిమా అవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన నాగశౌర్యకి, శంకర్ ప్రసాద్‌కి, ఉష మేడమ్‌కి, బుజ్జిగారికి నా హదయపూర్వక కతజ్ఞతలు' అని అన్నారు. ''అలా ఎలా?' ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెం.4 ఈ రోజు ప్రారంభించడం హ్యాపీగా ఉంది. ఈ కోవిడ్ టైమ్‌లో కూడా మా మీద ఉన్న అభిమానంతో మేం పిలవగానే వచ్చిన కొరటాల శివ, అనిల్ రావిపూడి, నారా రోహిత్, నాగవంశీ గారికి ధన్యవాదాలు. డిసెంబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించనున్నాం. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం' అని చిత్ర నిర్మాత ఉషా ముల్పూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత బుజ్జి, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్: అనీష్ కృష్ణ, నిర్మాత: ఉష ముల్పూరి, సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి, సహ నిర్మాత: బుజ్జి, సంగీతం: మహతి స్వరసాగర్, సినిమాటోగ్రాఫర్: సాయిశ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రాము, డిజిటల్ హెడ్: ఎం.ఎస్.ఎన్. గౌతమ్.