Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లరి నరేష్ పూర్తి భిన్నమైన, ఓ ఉద్వేగ భరితమైన పాత్ర పోషిస్తున్న చిత్రం 'నాంది'. ఈ సినిమా ద్వారా విజరు కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. 'చిత్రీకరణ పూర్తి చేసుకున్న సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే అల్లరి నరేష్ ఓ గదిలో బందిగా కిటికీ దగ్గర నిల్చొని తన బాధను వ్యక్త పరుస్తున్నాడు. దీంతో అల్లరి నరేష్ ఈ సినిమాలో ఇప్పటివరకు చెయ్యని ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్నాడని ఈ స్టిల్ చెప్పకనే చెబుతోంది. నిర్మాత సతీష్ వేగేశ్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన నాంది పోస్టర్ (ఫస్ట్ రివీల్ ఇంప్యాక్ట్) కు అద్భుతమైన స్పందన లభించింది. శ్రీచరన్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నవమి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్, వినరు వర్మ, సి.ఎల్. నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్, రమేష్‌రెడ్డి, చక్రపాణి, రాజ్యలక్ష్మి, మణిచందన, ప్రమోదిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజరు కనకమేడల, నిర్మాత: సతీష్ వేగేశ్న, లైన్ ప్రొడ్యూసర్: రాజేష్ దండా, సినిమాటోగ్రఫీ: సిద్, ఆర్ట్: బహ్మ్ర కడలి, ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కథ: తూమ్ వెంకట్, డైలాగ్స్: అబ్బూరి రవి, సాహిత్యం: చైతన్య ప్రసాద్, శ్రీమణి, ఫైట్స్: వెంకట్.