Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్ని కష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వెలంపల్లి దర్శక, నిర్మాతగా తెరకెక్కించిన సినిమా 'చెక్ మేట్'. డాక్టర్ రాజేంద్రప్రసాద్, విష్ణుప్రియ సందీప్, దీక్షపంత్, బ్రహ్మనందం, రఘుబాబు షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శక, నిర్మాత ప్రసాద్ వెలంపల్లి మాట్లాడుతూ,'మా సినిమాకి సెన్సార్ యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. థియేటర్స్ డిసెంబర్ 4 నుంచి ఓపెన్ అవుతాయని తెలుస్తోంది. థియేటర్ల ఓపెనింగ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాని రిలీజ్ చేస్తాం. ఇటీవల ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ మా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా లేటెస్ట్ ట్రెండ్‌కి తగిన విధంగా, అన్ని హంగులతో ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుంది. నలుగురు వ్యక్తులు, వాళ్లకు వచ్చిన సమస్యలను ఎలా దైర్యంగా ఎదుర్కొన్నారనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించాం. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, రఘుబాబు మిగతా అందరూ నటీనటులు, టెక్నీషియన్స్ మాకు పూర్తిగా సపోర్ట్ చేశారు. భారీ స్టార్ కాస్ట్‌తో మలేషియా, సింగపూర్‌లోని బ్యూటిఫుల్ లోకేషన్స్‌లో తెరకెక్కించాం' అని చెప్పారు. 'ఈ సినిమా నాకు చాలా స్పెషల్. నాకు ఎంతో నేర్పించింది. నాకు మంచి వ్యక్తులను పరిచయం చేసింది. నాకు ఎన్నో అనుభూతుల్ని మిగిల్చింది. అమ్మ రాజశేఖర్ రెండు సాంగ్స్‌కి చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. మీరందరూ ఎంజారు చేస్తారు' అని కథానాయిక విష్ణు ప్రియ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గరుడ వేగ అంజి, మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్: మహతి, ఎడిటర్: క్రాంతి, లిరిసిస్ట్: రెహమాన్, కో ప్రొడ్యూసర్: కె.కామేశ్వర్, నిర్మాత, దర్శకత్వం: ప్రసాద్ వెలంపల్లి.