Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపూర్ణేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి 'బజార్ రౌడీ' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. వసంత నాగేశ్వరావు దర్శకత్వంలో కె.ఎస్ క్రియేషన్స్ పతాకంపై సందిరెడ్డి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుకి జోడిగా మహి నటిస్తుంది. పాటల్లో సంపూర్ణేష్ బాబు డాన్స్‌లకు, ఆయన వేసే స్టెప్స్‌కి ఉన్న క్రేజ్ వేరే చెప్పనక్కర్లేదు. ఆ క్రేజ్‌ని ఇప్పుడు 'బజార్ రౌడీ' టీమ్ డబుల్ చేస్తున్నారు. ఎన్నో తమిళ, తెలుగు సూపర్ హిట్ చిత్రాలకు, సూపర్‌స్టార్స్‌కి కొరియోగ్రఫి అందించిన ప్రేమ్‌రక్షిత్ మాస్టర్ సంపూతోనూ అదిరిపోయే స్టెప్స్ వేయిస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ చిత్రీకరణ రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
ఈ సందర్బంగా దర్శకుడు వసంత నాగేశ్వరావు మాట్లాడుతూ,'ఎంతో బిజీగా ఉండి, ఎన్నో బ్లాక్‌బస్టర్ ఫిల్మ్స్‌కి కొరియోగ్రాఫర్‌గా పనిచేసి, ఆ చిత్రాల గ్రాఫ్‌ని మార్చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మా సంపూతోనూ స్టెప్స్ వేయించి, మా సినిమా గ్రాఫ్‌ని మార్చినందుకు ధన్యవాదాలు. ఈ సాంగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో హీరో సంపూర్ణేష్ బాబు, హీరోయిన్ మహితోపాటు 20 మంది డాన్స్ర్స్పై చిత్రీకరిస్తున్నాం. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయ్యింది. త్వరలో క్లైమాక్స్, మరో రెండు సాంగ్స్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ చిత్రానికి మేం పెట్టిన 'బజార్ రౌడీ' టైటిల్‌కి మంచి రెస్పాన్స్ రావటం మాలో కొత్త ఎనర్జి వచ్చింది. మా నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శేఖర్ తన అనుభవంతో ఎక్కడ ఖర్చుపెడితే స్క్రీన్ మీద కనబడుతుందో చక్కటి ప్లానింగ్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో షియాజి షిండే, థర్టీ ఇయర్స్ పథీ¸్వ, నాగినీడు, షఫి, జీవ, సమీర్, మణిచందన, నవీన, పద్మావతి లాంటి తారాగాణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్ తదితర వివరాలను అతిత్వరలో తెలియజేస్తాం' అని తెలిపారు.
ఈ చిత్రానికి మాటలు : మరుధూరి రాజా, డి ఓ పి : ఎ. విజయ్ కుమార్, సంగీతం : సాయికార్తిక్, ఫైట్ మాస్టర్ : జాషువా, దర్శకత్వం :వసంత నాగేశ్వరావు.