Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కార విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్‌కు మరో అరుదైన గౌరవం లభించడం విశేషం. బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) సంస్థ ఇండియన్ బ్రేక్‌త్రూ ఇన్షియేటివ్ అంబాసిడర్‌గా రెహ్మాన్‌ను నియమించినట్లు అధికారికంగా తెలియజేసింది. బాఫ్టా, నెట్‌ఫ్లిక్స్ సహాకారంతో మన దేశంలోని గొప్ప కళాకారులను గుర్తించడానికి రెహ్మాన్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. సోషల్ మీడియా వేదికగా దీని గురించి రెహమాన్ స్పందిస్తూ, ''టీవీ, ఆటలు, సినిమా రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. మన దేశంలోని అద్భుతమైన ప్రతిభావంతులను ప్రపంచవేదికపై నిలబెట్టడానికి ఆతతగా ఎదురు చూస్తున్నాను' అని చెప్పారు. రెహ్మాన్ సేవలు బాఫ్టాకు ఎంతగానో ఉపయోగపడతాయని చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా బెర్రీ తెలిపారు.