Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్, రావమ్చరణ్ కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రుధిరం రణం). ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో అటు బాలీవుడ్, ఇటు హాలీవుడ్ నటీనటుల కలయికలో ఈ సినిమా రూపొందుతోంది. లాక్డౌన్ తర్వాత పునః ప్రారంభమైన ఈ సినిమా 50 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌ను రాత్రి వేళల్లోనే చిత్రీకరించడం విశేషం. సినిమాకి హైలైట్‌గా ఈ భారీ యాక్షన్ షెడ్యూల్ నిలుస్తుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంతో ఉందని సమాచారం. త్వరలోనే కొత్త షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది. అలియా భట్, ఒలివియా మోరిస్, అజరు దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి వంటి హేమాహేమీలు నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన క్యారెక్టర్ లుక్ పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ అంచాలను పెంచింది. ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే ఈ సినిమా ఉండేలా దర్శకుడు రాజమౌళి ఆద్యంతం విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని వినిపిస్తోంది.