Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య హీరోగా, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'లక్ష్య' అనే టైటిల్‌ను చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. అలాగే దీనికి సంబంధించి స్పెషల్ పోస్టర్ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్లో నాగశౌర్య సూపర్ ఫిట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగశౌర్య కెరీర్లో 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేేసిన స్టన్నింగ్ ఫస్ట్‌లుక్ అందరినీ థ్రిల్ చేసింది. 'ది గేమ్ విల్ నెవర్ బీ ద సేమ్' అంటూ 8 ప్యాక్ బాడీతో చేతిలో బాణం పట్టుకుని వారియర్ పోజ్‌లో ఉన్న నాగశౌర్య లుక్ అద్భుతంగా ఉందని అందరూ అప్రిషియేట్ చేశారు. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ చిత్రంగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రం తెరకెక్కుతోందని చిత్ర బృందం తెలిపింది.
నాగశౌర్య, కేతిక శర్మ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ : రామ్‌రెడ్డి, సంగీతం: కాలబైరవ, ఎడిటర్: జునైద్, నిర్మాతలు: నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంతోష్ జాగర్లపూడి.