Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిట్నెస్ కి కథానాయికలు ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తారో వేరే చెప్పక్కర్లేదు. కఠినమైన డైటింగ్ నియమాలతో, వ్యాయామం, యోగతో ఎప్పుడూ ఫిట్‌గా ఉండేందుకు బాగా శ్రమిస్తుంటారు. ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ వాళ్ళు ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి కూడా రహస్యమిదే. ఈ ఫిట్నెస్ విషయంలో కథానాయిక అనుష్క శర్మ చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహిరిస్తోంది. పైగా తానిప్పుడు గర్భవతి కూడా. అయినప్పటికీ రెగ్యులర్‌గా తాను ఎలాంటి వ్యాయామం, యోగ చేస్తుందో వాటిని క్రమం తప్పకుండా చేస్తోంది. యోగాసనాల్లో కొంచెం కఠినమైన శీర్షాసనాన్ని కూడా అనుష్క వదిలిపెట్టడం లేదు. ఈ ఆసనాన్ని భర్త విరాట్ కోహ్లీ, యోగా శిక్షకురాలి పర్యవేక్షణలో వేశారు. ఇప్పుడీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 'యోగా నా జీవన శైలిలో ఓ భాగమైపోయింది. గర్భవతిగా ఓ స్థాయి వరకు గతంలో రోజూ వేసే ఆసనాలు వేయవచ్చని వైద్యులు సూచించారు. అందులో భాగంగానే శీర్షాసనాన్ని వేశాను. దీని కోసం నా భర్త సహకారాన్ని తీసుకున్నా. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా వ్యాయామాన్ని కొనసాగించడం ఎంతో సంతోషంగా ఉంది' అని అనుష్క శర్మ తెలిపింది.