Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ నటుడు, నిర్మాత యాదాకృష్ణ (61) కన్నుమూశారు. బుధవారం ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. నటనతోపాటు ఆయన పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. అలాగే 'గుప్తశాస్త్రం', 'వయసు కోరిక', 'పిక్నిక్' వంటి తదితర 20 చిత్రాల్లో కథానాయకుడిగానూ నటించి ప్రేక్షకులను అలరించారు. 2010లో వచ్చిన 'సంక్రాంతి అల్లుడు' ఆయనకు చివరి సినిమా.