Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విష్ణు మంచు హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'మోసగాళ్లు'. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఇది విడుదలవుతోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై 'మోసగాళ్లు' చిత్రాన్ని విష్ణు మంచు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్గా నవీన్ చంద్ర బర్త్‌డేని పురస్కరించుకుని ఆయనకు విషెస్ తెలియజేస్తూ, సినిమాలో ఆయన లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో సిద్ అనే పాత్రను నవీన్ చంద్ర పోషిస్తున్నారు. ఇంటెన్స్ లుక్స్‌తో, మాస్ అప్పీల్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆయన కనిపిస్తున్నారు. చరిత్రలో నమోదైన అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లాస్ ఏంజెల్స్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్, ఆయనకు జోడీగా రుహీ సింగ్ నటిస్తున్నారు. సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌ, ప్రొడక్షన్ డిజైన్: కిరణ్‌కుమార్ ఎం.