Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభిమానులతోపాటు ప్రేక్షకుల్ని సైతం అగ్ర కథానాయకుడు ప్రభాస్ సర్ప్రైజ్ చేశారు. మరో పాన్ ఇండియా సినిమా 'సలార్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో క్వాలిటీ చిత్రాలను నిర్మించి దక్షిణాది సినీ పరిశ్రమను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్ళాలనే ఉన్నతాశయంతో ప్రారంభమైన నిర్మాణ సంస్థ హౌంబలే ఫిలింస్. ఇప్పుడు ఈ సంస్థ పాన్ ఇండియా నిర్మాణ సంస్థగా మారింది. ఈ బ్యానర్లో రాకింగ్‌స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్ పాన్ ఇండియా చిత్రం 'కె.జి.యఫ్ ఛాప్టర్1' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే మరో పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రం 'కె.జి.యఫ్ ఛాప్టర్ 2' చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు హౌంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తన బ్యానర్ లో మూడో పాన్ ఇండియా సినిమా 'సలార్'ను రూపొందించనున్నట్లు ప్రకటించారు. సినిమా టైటిల్‌తో పాటు ప్రభాస్ లుక్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ, 'మా బ్యానర్లో కె.జి.యఫ్ ఛాప్టర్ 1, కె.జి.యఫ్ ఛాప్టర్ 2 వంటి పాన్ ఇండియా చిత్రాల తర్వాత మూడో పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించబోతున్నాం. అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. 'బాహుబలి'తో ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సినిమా చిత్రీకరణను స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న 'రాధేశ్యామ్' విడుదల తర్వాత మా సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న 'సలార్' చిత్రాన్ని భారతీయ భాషలన్నింటిలోనూ రూపొందిస్తాం' అని తెలిపారు.