Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు వీక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్, వెబ్ షోలు అందిస్తున్న ఓటీటీ వేదిక 'జీ 5'. తమిళ హీరో 'జయం' రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'కోమాలి'. నేడు (శుక్రవారం) 'జీ 5'లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రీమియర్ కానుంది. పదహారేళ్లు కోమాలో ఉన్న ఓ వ్యక్తి మళ్లీ ఈ లోకంలోకి వస్తే? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. పదహారేళ్లకు, ఇప్పటికి సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా కథానాయకుడు అలవాటు పడ్డాడా?, పదహారేళ్ల క్రితం సమాజంలో ఉన్న హీరో చేసే పనులు ఏమిటి? అనేది ఆసక్తికరం. ఇదొక వినోదాత్మక చిత్రమని 'జీ 5' వర్గాలు తెలియజేశాయి. ఈ సినిమాలో సంయుక్తా హెగ్డే సెకండ్ హీరోయిన్గా నటించింది. స్కూల్ డేస్‌లో హీరోని ప్రేమించిన అమ్మాయిగా, హీరో కోమా నుండి తిరిగొచ్చే సమయానికి మరొకరిని పెళ్లి చేసుకున్న మహిళగా కనిపిస్తారు. కమెడియన్ యోగిబాబు, హీరో జయంరవి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. ఎమ్మెల్యేగా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'హిప్ హాప్' తమిళ సంగీత దర్శకుడు.