Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య, అనీష్ కష్ణ కాంబినేషన్లో రూపొందుతున్న రోమ్-కామ్ అక్టోబర్ చివరి వారంలో గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం విదితమే. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో, ఉష ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ శుక్రవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది.
'ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ అందమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఆక్లాండ్‌కు చెందిన సెన్సేషనల్ సింగర్, యాక్టర్ షిర్లీ సేతియా నాయికగా నటిస్తున్నారు. దర్శకునిగా అనీష్ కష్ణకు ఇది మూడో చిత్రం. స్టార్ కమెడియన్స్ వెన్నెల కిశోర్, రాహుల్ రామకష్ణ, సత్య నటిస్తుండటంతో ఈ సినిమాలో నవ్వులకు కొదవ ఉండదని అర్థమవుతోంది. మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సహ నిర్మాత: బుజ్జి, ఎడిటింగ్: తమ్మిరాజు, ఆర్ట్: రామ్‌కుమార్, డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్.గౌతమ్.