Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'టక్ జగదీష్'. ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ ఏకధాటిగా జరుగుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ని ఆరంభించారు.
'నాని నట్ణిస్తున్న 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన చివరి షెడ్యూల్లో చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. వైవిధ్యమైన కథ, కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.
సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ ఫిమేల్ లీడ్స్‌లో నటిస్తుండగా, జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి, తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.. ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
ఈ చిత్రానికి ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: సాహి సురేష్, ఫైట్స్: వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్).