Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభానటేష్, అను ఇమ్మానుయెల్ హీరో, హీరోయిన్లుగా సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అల్లుడు అదుర్స్'. రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై గొర్రెల సుబ్రమణ్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 14న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్‌గా అత్యధిక థియేటర్స్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిథుల సమక్షంలో వైభవంగా జరిపారు. ఈ చిత్ర బిగ్ సీడీని అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ రిలీజ్ చేయగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది. ఈ చిత్ర మొదటి టికెట్‌ని దర్శకుడు అనిల్ రావిపూడి కొనుగోలు చేశారు. నిర్మాతల సతీమణులు పద్మావతి, హేమ, రమ్య సంయుక్తంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ,'ఈ సినిమాలో సాయి చాలా అందంగా ఉన్నాడు. కాస్ట్యూమ్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. నాలుగు పాటలు చూశాను. ఆకలి మీద ఉన్న పులిలా, కసితో డాన్సులు, ఫైట్స్‌తో రచ్చ చేశాడు. సినిమా అంటే పిచ్చితో రాజమండ్రి నుండి వచ్చి ఫ్యాషన్‌తో తన పార్టనర్ రమేష్‌తో కలిసి ఈ చిత్రాన్ని రిచ్‌గా నిర్మించారు సుబ్రమణ్యం. వారికి ఈ సినిమా మంచి విజయం సాధించి, పేరుతోపాటు డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని మిక్స్ చేసి ఫుల్ ప్యాక్డ్గా సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాని అద్భుతంగా తీశాడు. తప్పకుండా ఈ చిత్రం సంతోష్ శ్రీనివాస్‌కి మంచి పేరు తెస్తుంది. బిగ్ స్కేల్లో సంక్రాంతికి వస్తున్న ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా' అని చెప్పారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ,'రాజీ పడని భారీ బడ్జెట్‌తో, అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించిన సుబ్రమణ్యం, రమేష్ గారికి కతజ్ఞతలు. దేవిశ్రీప్రసాద్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్.ఆర్తో సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లారు. చోటాగారి బ్యూటిఫుల్ విజువల్స్ సినిమాకి హైలెట్ అవుతాయి. మంచి సినిమా చేశాం. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను' అని అన్నారు. 'మా హీరో సాయి చాలా హార్డ్ వర్కర్. సినిమా కోసం ఎంతైనా కష్టపడతాడు. సినిమా చాలా బాగా వచ్చింది. బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎప్పుడు సంతోషంగా ఉంటూ, పట్టుదలతో మా బ్యానర్లో ఫస్ట్ సినిమా చేసిన సంతోష్ శ్రీనివాస్‌కి థ్యాంక్స్. బ్రాండ్ ఇమేజ్ ఉన్న సురేష్ గారివల్లే ఈ సినిమా తీయడం సాధ్యమైంది' అని నిర్మాత గొర్రెల సుబ్రమణ్యం తెలిపారు.
చిత్ర సమర్పకుడు గంజి రమేష్ మాట్లాడుతూ,'మా సినిమా ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. మంచి కథతో చాలా బాగా ఈ సినిమాని తెరకెక్కించారు. మా హీరో సాయి డాన్సులు, ఫైట్స్, కామెడీ బాగా చేశాడు. ఇంతకుముందు సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా ఒక ఎత్తు. సంక్రాంతికి అల్లుడు అదుర్స్ అనిపిస్తాడు' అని చెప్పారు.
చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ,'సాయి నట విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. మా అల్లుడు అదుర్స్ అనిపించుకుంటాడని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను' అని అన్నారు.