Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో రెడీ అవుతున్న ఈ సినిమాను బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ చిత్ర యూనిట్ తాజగా ఈ చిత్రానికి సంబంధించిన సంక్రాంతి పోస్టర్ని విడుదల చేసింది.
'ఈ పోస్టర్లో అఖిల్ - పూజా మధ్య కెమిస్ట్రీ కనువిందుగా ఉంది. అలానే అఖిల్ అక్కినేని మ్యాన్లీ లుక్ అల్ట్రా స్టయిలీష్‌గా ఉంది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో, లవ్లీగా ఉండే క్యారెక్టర్స్‌గా డిజైన్ చేస్తారు. అందుకే ఆయన చిత్రాలకి ఓ స్పెషాలిటి ఉంటుంది. అఖిల్, పూజా మధ్య ఎలాంటి కెమిస్ట్రి ఈ చిత్రంలో ఉండబోతుందో ఈ పోస్టర్ డిజైనింగ్‌లో చక్కగా, అందంగా చూపించారు దర్శకుడు భాస్కర్. ఈ సినిమాను వేసవిలో విడుదల చేయడానికి నిర్మాత బన్నీ వాసు సన్నాహాలు చేస్తున్నారు.