రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్' అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బందం బుధవారం సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ఈ పోస్టర్ ద్వారా నిర్మాతలు తెలియజేశారు. 'ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారులకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు, రానా బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలను పెంచి ఆడియెన్స్‌లో, ఇండిస్టీ వర్గాల్లో క్రేజ్ తీసుకొచ్చాయి. ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని పాత్రల్లో రానా, సాయిపల్లవి నటిస్తున్నారు. మిగతా ముఖ్య పాత్రల్లో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కనిపించనున్నారు.