Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్‌కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకుడు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
లాయర్స్ వేసుకునే కోటుని పవన్‌కల్యాణ్ వేసుకోవడంతో మొదలైన టీజర్.. ఆయన 'లా' పుస్తకాలను మూసి ఉంచిన కవర్‌ను తొలగించడం, సీరియస్‌గా కోర్టులో అబ్జక్షన్ యువరానర్ అంటూ డైలాగ్ చెప్పడం.. అలాగే తనని కత్తితో పొడవడానికి వచ్చిన విలన్స్‌తో కోర్టులో వాదించడం తెలుసు... కోటు తీసి కొట్టడమూ తెలుసు అంటూ వారితో ఫైట్ చేయటం..వంటి మాస్ సన్నివేశాలతో పాటు.. చివరలో తన లగేజీతో ట్రావెల్ చేస్తుంటారు. బ్యాగ్రౌండ్లో సత్యమే జయతే.. అనే పదానికి సంబంధించిన మ్యూజిక్ వినిపిస్తుంది. టీజర్ పక్కా మాస్‌ను, పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. తమన్ తనదైన స్టైల్లో అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో టీజర్‌లోని ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేశాడు. పవన్ కల్యాణ్ సినిమాను ఎలా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారో అలాంటి మాస్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించారు' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర తారాగణంగా నటిస్తున్నారు.