Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు టెలివిజన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 'స్టార్ మా' ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కొత్తరకం కథల్ని, ధైర్యసాహసాల వ్యక్తుల విశిష్ట గాధల్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుంటోంది. కొత్తదనానికి అగ్ర తాంబూలం ఇస్తూ వస్తున్న స్టార్ మా ఇప్పుడు ఓ అద్భుతమైన చారిత్రక సువర్ణాధ్యాయాన్ని 'రుద్రమదేవి' సీరియల్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఏ పేరు వింటే ప్రతి తెలుగు హదయం ఉప్పొంగుతుందో, ఆ రుద్రమ దేవి కథే ఇప్పుడు ఓ అద్భుతమైన ధారావాహికగా తెలుగు లోగిళ్లకు గొప్ప అనుభూతిని పంచబోతోంది. స్ట్రెయిట్ తెలుగు సీరియల్‌గా, ఓ దశ్యకావ్యంలా రూపు దిద్దుకున్న ఈ రుద్రమదేవి ధారావాహిక కథాకాలాన్ని యథాతథంగా చిత్రీకరించేందుకు వందల మంది ఎంతగానో కృషి చేశారు. ఉన్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలను పాటిస్తూ కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రేక్షకులకు అందించేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఈ ధారావాహిక 'స్టార్ మా'లో ఈనెల 18 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. 'ఇది మన తెలుగు కథ. మన తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న కథ. ఇంతకుముందు ఎన్నడూ బుల్లితెరపై కనిపించని ప్రమాణాలతో స్టార్ మా అందిస్తున్న కథ' అని స్టార్‌మా ప్రతినిధులు పేర్కొన్నారు.