Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం 'అల్లుడు అదుర్స్'. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల14న విడుదలై విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. నభా నటేష్, అను ఇమ్మానుయెల్ హీరోయిన్స్‌గా రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో గొర్రెల సుబ్రమణ్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇంటిల్లిపాదినీ అలరిస్తున్న నేపథ్యంలో చిత్ర బందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు గంజి రమేష్ కుమార్ మాట్లాడుతూ, 'మా సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ, మంచి విజయాన్ని సాధించింది. మా హీరో సాయి శ్రీనివాస్ డాన్సులు, ఫైట్స్‌తో పాటు పెర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. సోనుసూద్ క్యారెక్టర్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. నైజాం, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజు, శిరీష్‌లు ఎంతో ఇష్టపడి, సినిమా మీద నమ్మకంతో రిలీజ్ చేశారు. వారి నమ్మకం నిజమైంది. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మంచి సినిమా తీశారని ప్రశంసిస్తున్నారు' అని అన్నారు. 'మా బ్యానర్లో సాయి శ్రీనివాస్‌తో ఫస్ట్ సినిమా తీయడం చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీతో థియేటర్‌కి వెళ్లి ఈ సినిమాని బాగా ఎంజారు చేశాం. అలాగే ప్రతి ఒక్కరూ ఎంజారు చేస్తున్నారు. సంక్రాంతి బరిలో విజయం సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. వెంటనే సాయితో రెండో సినిమా తీయడానికి మేం రెడీగా ఉన్నాం' అని నిర్మాత గొర్రెల సుబ్రమణ్యం చెప్పారు.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ,' మా సినిమాకి ఫస్ట్ రోజే మూడున్నర కోట్లు షేర్ వచ్చింది. మూడు రోజుల్లోనే పది కోట్ల షేర్ వచ్చింది. మొత్తం ఈ సినిమా బడ్జెట్ 32 కోట్లు. మాకు శాటిలైట్, ఆడియో రైట్స్ మీద 21 కోట్లు వచ్చాయి. నిర్మాతలు సేఫ్‌గా ఉన్నారు. ఇక నుండి వచ్చేదంతా ప్రాఫిట్ అవుతుంది. డెఫినెట్‌గా ఈ చిత్రం యాభై కోట్ల క్లబ్లో చేరుతుంది' అని తెలిపారు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ, 'ఈ సినిమా ఇంత బాగా అడుతుందంటే దానికి కారణం హీరో సాయి. ఈ క్రెడిట్ అంతా తనకే దక్కుతుంది. ఇది సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. ఈ సినిమా రేంజ్ ఏంటనేది నెల తరువాత అందరికీ తెలుస్తుంది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు' అని అన్నారు.'మా సినిమా చాలా అద్భుత విజయం సాధించింది. సినిమా చూసిన వారంతా చాలా బాగుంది. మేం బాగా ఎంజారు చేశాం అని నిజాయితీగా చెబుతున్నారు. ప్రేక్షకులను నవ్వించడానికి జెన్యున్‌గా ఈ సినిమా చేశాం. అద్భుత విజయం సాధించింది' అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పారు. ఈ వేడుక అనంతరం సోనూసూద్ చేతులమీదుగా 'అల్లుడు అదుర్స్' సక్సెస్ షీల్డ్ లను చిత్ర యూనిట్‌కి అందజేశారు.