Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రానికి 'లైగర్' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సినిమాతో కథానాయకుడు విజయ్ దేవర కొండ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్ళబోతున్నారు. పూరి కనెక్ట్స్‌తో కలిసి బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఓ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మిస్తున్నాయి. విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే నటిస్తోంది. సోమవారంయ 'లైగర్' చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ''లైగర్' టైటిల్‌తో పాటు 'సాలా క్రాస్‌బ్రీడ్' అనే ట్యాగ్ లైన్ తో ఉన్న ఫస్ట్‌లుక్ పోస్టర్లో విజయ్ దేవరకొండ పొడవాటి జుట్టు, చేతికి గ్లౌవ్స్ తో బాక్సింగ్ ప్లేయర్ గా కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ లో సింహం, పులి తలల మిశ్రమ రూపం ఉంది. టైగర్, లయన్ కలయిక వల్ల పుట్టే కొత్త బ్రీడ్ 'లైగర్'. ఈ టైటిల్ డిఫరెంట్‌గా ఉండడంతోపాటు ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
'మా పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'లైగర్'ను సగౌరవంగా ప్రకటిస్తున్నాం. నేషన్ వైడ్ మ్యాడ్నెస్ గ్యారెంటీడ్ అని కథానాయకుడు విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన హీరోలను పూర్తిగా భిన్నమైన అవతారాలలో చూపించే పూరి జగన్నాధ్ ఇంతవరకూ చూడని డిఫరెంట్ లుక్‌తో విజయ్ దేవరకొండను ఈ సినిమాలో చూపించారు. ఫస్ట్‌లుక్ పోస్టర్లో విజయ్ తన ఇంటెన్స్ లుక్, పొడవాటి జుట్టుతో ఆకట్టుకుంటున్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రం కావడంతో పూరి కనెక్ట్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మికౌర్, కరన్‌జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ట, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలీ, మరకంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: జానీ షేక్ భాషా, ఎడిటర్: జునైద్ సిద్దిఖీ. కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: పూరి జగన్నాథ్.