Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు వరుణ్ తేజ్ పుట్టిన రోజు మంగళవారం. ఈ సందర్భంగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి 'గని' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
'ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్నారని చెప్పేలా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చెప్పకనే చెబుతున్నాయి. బాక్సర్‌గా వరుణ్ తేజ్ లుక్ టెర్రిఫిక్ అంటూ ప్రేక్షకాభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. బాక్సర్ పాత్రలో ఒదిగిపోవడానికి వరుణ్‌తేజ్ ఓలింపిక్స్ బాక్సింగ్ విన్నర్ టోని జెఫ్రీస్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకోవడం విశేషం. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జార్జ్ సి.విలియమ్స్, మ్యూజిక్: తమన్.ఎస్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, నిర్మాతలు: సిద్ధు ముద్ద, అల్లు బాబీ, దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి.