Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా అశోక్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన క్రౌడ్ ఫండింగ్ చిత్రం మిస్టర్ అండ్ మిస్. రీడింగ్ ల్యాంప్స్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ఈనెల 29న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరో శైలేష్ సన్నీ బుధవారం మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే,'నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టం. బీటెక్ పూర్తి చేసుకుంటూ షాట్ ఫిల్మ్స్‌లో ట్రై చేశా. కాలేజీలో జరిగిన ఒక వేడుకలో చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. అది చూసి చాలా మంది బాగా నటించావన్నారు. దాంతో నటించగలననే నమ్మకం వచ్చింది. షార్ట్ ఫిలిమ్స్‌లో నటిస్తూ ఫైనాన్స్ సపోర్ట్ కోసం విప్రోలో జాబ్ చేశాను. ఈ క్రమంలోనే అశోక్ రెడ్డి దర్శకత్వంలో 30 నిమిషాల నిడివిగల 'మిస్టర్ అండ్ మిస్' షార్ట్ ఫిల్మ్‌లో నటించే అవకాశం వచ్చింది. ఈ షార్ట్ ఫిల్మ్‌నే ఎన్హేన్స్ చేసి సినిమాగా తెరకెక్కించాం. ఇందులో స్క్రీన్‌ప్లే, ట్విస్ట్ టర్న్స్ వేరే ఉంటాయి. హీరో, హీరోయిన్ల దగ్గర నుంచి మిస్ అయిన ఫోన్ నేపథ్యంలో జరిగే అంశాల సమాహారంగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో నేను విలేజ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అబ్బాయిగా నటించాను. హీరోయిన్ జ్ఞానేశ్వరి ముంబై నుండి వచ్చిన ఫ్యాషన్ గర్ల్‌గా నటించింది. మా డైరెక్టర్ ఫ్రెండ్ ఫోన్ పోయినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో డైరెక్టర్ చూశారు. దాన్ని సీరియస్ టాపిక్‌గా తీసుకుని, కమర్షియల్ పంథాలో ప్రేక్షకులకు వినోదాన్ని కల్పిస్తూ ఈ సినిమా చేశాం. యస్వంత్ నాగ్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలుస్తుంది. ఈ సినిమాలోని పాటలకు యూత్ అంతా కనెక్ట్ అవుతారు. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. చాలా మంది బ్రేకప్ అయిన లవర్స్‌కు మా సినిమా కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. చూసిన పేరెంట్స్ కూడా మీరు చెప్పిన పాయింట్స్ కరెక్ట్‌గా ఉన్నాయని నమ్ముతారు. నా తర్వాత సినిమా కోసం రెండు సినిమా కథలు విన్నాను. అలాగే మార్చిలో రెండు ఓటీటీి సినిమాలు స్టార్ట్ అవుతాయి' అని చెప్పారు.